.ఈ రోజుల్లో తెలిసిన మనిషి కనబడితే ముఖం చాతెస్తున్నారు.ఎందుకో.అంతా బిజీ లోకం..మొత్తానికి పలకరించేవాడు వెర్రి వాజమ్మ అవుతున్నాడు.పాపం.మార్పు రాదా?మీ అమూల్య అభిప్రాయము తెలపండి సజ్జనులారా.

Advertisements
ఈ రోజు ఒక మంచి పని చేశామనుకోండి ఆ మంచిని నలుగురు జ్ఞాపకము పెట్టుకుంటారు.ఎల్లప్పుడూ మనకోసమే బతకకూడదు.ఇతరులకోసము కూడా బతకాలి.అట్లాగా అని మనము కోటీశ్వరులూ,ధనవంతులూ అవవలసిన అవసరము లేదు.మాట సహాయము,చేతల సహాయమూ కూడా ఎంతో శ్రేష్టము.మన దగ్గరకు ఎందరో సలహాలకోసము ఎక్కడనుంచో వస్తారు.వారిని ఏమాత్రమూ నిరుత్సాహపరచకండి.చక్కటి ఆలోచన,సలహా ఇవ్వండి.అదే వారికి కొండంత అండ.

మన దేశానికీ,రాష్ట్రానికీ,పట్టణానికీ,పల్లెకీ ఏదో ఒక మంచి చేయండి.అదే మనము పోయినతరువాత కలకాలమూ నిలుస్తుంది.ఫలానా వారు ఈ సత్కార్యము చేశారు అనుకుంటే అదే మనకు కొండంత.ఏదో ఒకటి చేయండి.ఎవ్వరో చేస్తున్నారులే అనుకోకండి.నేనేమీ చేశాను అని మిమ్మల్నే మీరు ప్రశ్నించుకోండి.అదే సారి అయిన మానవత్వము.
కొందరు ఏమీ ఆశించకుండా నిశ్శబ్దముగా తమ పని చేసుకుంటూ ఉంటారు.ఆ పని ఏదో ఒకరోజు బయటపడుతుంది.అప్పుడే మనము వారిని గుర్తిస్తాము.మనము అదే గుర్తింపు ముందే చేస్తేనో?
అందరికీ మంచి చేద్దాము.అది మనకే మంచిది.

ప్రతిమనిషికీ తన సొంత ఊరు,పల్లెటూరుకి వెళ్లాలని మనస్సు ఉవ్విళూరుతుంది.అది సహజమే.మన నిజజీవితము చదువు,వృత్తి,వ్యాపార రీత్యా సమయము దొరకదు.మనకంటూ ఒక ప్రశాంతత దొరకదు.ఆకాశాన్ని అందె అధునాతన హర్మ్యాలలో మన నివాసము.విలాసవంత జీవితము.మనస్సు విత్తానికి పరుగులు.ఒకే యాంత్రిక జీవితము.ఎప్పుడు దీనికి అంతూ,దరీ.

అందుకే మన పల్లెకి పారిపోవాలని ఒకటే తపన.మన పల్లెని బాగుచేద్దామని ఒక సత్ సంకల్పము.పల్లెకి వెళ్ళి అందరినీ పలకరించాలని మనస్సు తహతహలాడుతుంది.మరి వెళ్దామా?

.

నాకు తెలుగు ఎలా వచ్చింది
1 post by 1 author
me (RAMAKRISHNA KOPPAKA change
8 Mar

నాకు తెలుగు ఎలా వచ్చింది?

నన్ను చాలామంది అడిగే ప్రశ్న ఇదే.నేను పుట్టి పెరిగినది ముంబై లో.అక్కడ మరాఠీ ఎక్కువగా వాడుకైన భాష.నాకూ ఎంతో మంది మరాఠీ స్నేహితులు ఉండేవారు.నాకు మరాఠీ బాగా వచ్చును.ఒక సారి నేను మా అమ్మగారితో ఏలూరు వెళ్ళాను.మా అమ్మగారే తెలుగులో మాట్లాడేవారు.ఏలూరు మా అమ్మగారి ఊరు.మా నాన్నగారిది వసంతవాడ,ఏలూరు దగ్గర.అప్పుడు బస్ స్టాండ్ ఇప్పుడు పాత బస్ స్టాండ్ అనేవారు.నాకు తెలుగు చదవటము రాదు.ప్రతి బస్ వచ్చినప్పుడు అమ్మా ఈ బస్ మన వూరు వెళ్తుందా అని అడిగేవాడిని.అమ్మ లేదురా నాయనా అనేది.ఒకరు,ఇద్దరు మా అమ్మగారిని అడిగారు.ఇతను మీ అబ్బాయేనా అని.ఎందుకు అని మా అమ్మగారు అడిగారు.ఏమీలేదండీ.ఒకే నస.ప్రతి బస్ రాగానే ఎందుకు అడుగుతున్నాడని.తెలుగు రాదా?

అప్పుడు నా వయస్సు 10 ఏళ్ళు.అయిదు చదువుతున్నాను ముంబై లో.చాలా సిగ్గెసింది.ముంబై రాగానే మా నాన్నగారిని నన్ను తెలుగు బడిలోనే చేర్చమని.ఆ బడి పేరు The Andhra Education Society’s High School,Kings Circle,Mumbai.మేము ఉండేది విలే పార్లే.బాంద్రా లో రైలు మారి వెళ్ళాలి.నా పట్టుదల చూసి మా నాన్నగారు నన్ను ఆంధ్రా స్కూల్ లో చేరిపించారు.నాకు అ,ఆ,ఇ,ఈ లు రావు.ఏడుపు వచ్చింది.నా ఏడుపు చూసి పరిక్షిత్ అనే తెలుగు మాస్టారు నాకు తెలుగు అక్షరాలూ,అచ్చులు,హల్లులూ,గుణింతాలూ నేర్పారు.కష్టపడి చదివేవాడిని.అందరూ నన్ను చూసి నవ్వేవారు.తెగ ఎక్కిరించేవారు.అయినా పట్టుదలతో,ఏకాగ్రతతో నేను తెలుగు నేర్చుకున్నాను.ఆ రోజుల్లో ఎస్.ఎస్.ఎల్.సీ.అనేవారు.నాకు తెలుగులో ఫస్ట్ మార్కులు.

మళ్ళీ ఏలూరు వెళ్ళి మా వూరు బస్ నేనే ఎక్కేవాడిని.ఎంతో గర్వపడేవాడిని.నా మాతృభాష తెలుగు.నేను తెలుగు వాడిని.అప్పుడు తెలిసింది తెలుగు లోని మాధుర్యము.

ఇంతకీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మీ పిల్లలకి తెలుగు నేర్పన్దీ.పెద్ద బాలశిక్ష కొనండి.నేర్పన్దీ.తెలుగే మన వెలుగు.

ధన్యవాదములు

.నమస్తే.శుభోదయము.

ప్రస్తుతము నేను ముంబై లో మా అమ్మగారి దగ్గర ఉంటున్నాను..ఎంతో సంతోషముగా ఉన్నది.మా మాతృమూర్తి 94 ఏళ్ళు.ఆమె సేవలోనే ఉన్నాను.అదే నాకు తృప్తి.పరమార్ధము.మార్చ్ మూడున మా చెల్లెలి కూతురు నిశ్చితార్ధము జరిగినది.మా కుటుంబ సభ్యులు అందరూ ముంబాయి వచ్చారు.మా బావగారిది విజయనగరము.మరునాడు వారి తమ్ముడు మాకు ఇష్టమైన మామిడి తాండ్ర మనవేపునుంచి తెచ్చి ఇచ్చారు.నాకూ,మా అమ్మగారికీ మామిడితాండ్ర అంటే ఎంతో ప్రీతి.ఒక్కొక్కపోరా తీసిపెడుతూఉంటే ఆవిడ ఎంతో ప్రీతిగా తిన్నారు.మాకెంతో అదృష్టము ఎక్కడో మనవేపునుంచి మామిడితాండ్ర తేవతము,మేము మనసారా తినటము మా అధృష్టమే కదా.
నా చిన్నప్పుడు అనగా ఆరవఏట నేను ఏలూరు మా తాతయ్యగారిదగ్గర ఉండేవాడిని.ఒక రోజు నేను తాతయ్యా నాకు మామిడి తాండ్ర తినాలనిఉన్నది అన్నాను.వెంటనే వారు అనకాపల్లే నుండి బుట్టెడు మామిడి తాండ్ర తెప్పించారు.ఇంకేం.తింటూ కూర్చున్నాము.నేను,మా అమ్మమ్మ,అమ్మ,తాతయ్య.ఆ రోజులు జ్ఞాపకము వచ్చాయి ఈ ముంబాయి ట్రిప్ లో.మా అమ్మగారికి అదే సంగతి చెప్పాను.ఆవిడ ఎంతో నవ్వుతూ,ఎమోరా మీ తాతయ్య వెళ్ళిపోయారు.ఆయన మహానుభావుడు.ఎవరికి ఏమి కావాలన్నా వెంటనే తెప్పించేవారు.ఆ ప్రేమా,ఆత్మీయత,అనురాగము ఈ రోజుల్లో ఎక్కడివిరా?
ఇప్పుడు మా అమ్మగారి ప్రేమే నాకు వరాలమూట.అంతకన్నా ఏమిటి కావాలి.రోజాల్లా ఆవిడతో నా చిన్ననాటి ముచ్చట్లు.పొద్దున్నే ఆరుగంటలకి ఆమెను లేపుట.బ్రష్ మీద పేస్ట్ వేస్తే ఆమె పళ్ళు తోముకుని చక్కగా మేమిద్దరమూ ఫిల్టర్ కాఫీ జుర్రుకుంటూ తాగటము.మళ్ళీ రెండో రౌండు.తదుపరి స్నానము.టిఫిన్.మధ్యలో ఆవిడకి మందులు.కాస్సేపు టీవీ ఈటీవీ,టీవీ9 వార్తలు.ఖబుర్లు.రాజకీయాలు.ఇప్పుడే ఈనాడు పేపరు చదువుతున్నారు.ఈ లోగా ఈ వ్యాసము వ్రాస్తున్నాను.తదుపరి భోజనము.కొంచము కునుకు తియ్యుట.ఎవరో బంధువుల రాక,పరామర్శలు.
నాలుగింటికి కాఫీ,మిక్స్చర్,చేగోణీలు,సున్నుండలు.భలే,భలే.మళ్ళీ టీవీ లో వార్తలు.రాత్రి తొమ్మిది గంటలకి భోజనాలు.మాత్రలు.టైమ్ అస్సలు తెలియుటలేదు.పది గంటలకి నిద్ర.ఇదే దినచర్య.
తల్లికి సేవ.అదే పరమార్ధము.ఆమె ఒక చంటిపిల్లాడివలే నవ్వుతూఉంటే నాకెంతో ఆనందము.పరమానందము.
Click here to Reply
1 post by 1 author
me (RAMAKRISHNA KOPPAKA change
7 Mar

ఒక్కడినే వచ్చాను ఒక్కడినే పోతాను.మధ్యలోదే జీవితము.

ఈ భూమి మీదకి ఒక్కడినే వచ్చాను.3 – 6 – 1948 జూన్ మూడు 1948 న జన్మించాను.త ల్లీ నవమాసాలూ కనీ పెంచి పెద్ద చేసింది.తండ్రి చక్కని ఉన్నత చదువులు ఇచ్చారు.మంచి సంస్కారము,సత్ ప్రవర్తన నేర్పించారు.నలుగురితో ఎట్లా మెసలాలో,కలుపుగోరుగా ఉండాలో నేర్పారు.ప్రపంచములోకి ధైర్యముగా చొచ్చుకు పోవటము నేర్పారు.

ఉన్నత చదువులు,క్రమశిక్షణతో1971 వృత్తిలోకి చేరాను.అప్పుడు నా వయస్సు 23 ఏళ్ళుఅడుగడుగునా ఎదురయ్యే సమస్యలను కఠిన పరిశ్రమతో పోరాడి ముందుకి వెళ్ళాను.నా 23 ఏట వృత్తిలోకి చొరబడ్డాను.ప్రతిరోజూ వృత్తిరీత్యా మెలకువలూ,నైపుణ్యమూ నేర్చుకున్నాను.అస్సలు అలుపూ,సొలుపూ తెలియకుండా ముందడుగూ వేస్తూనే పోయాను.

1975 నవంబర్ 10 నా వివాహము.యావత్ భారతదేశములో వస్త్ర రంగములో వృత్తి రీత్యా పని చేశాను.45 ఏళ్ళు ఎడతెరపీ లేకుండా కష్టపడి పని చేశాను.ఒక కూతురు,ఒక కుమారుడు చక్కని చదువులు చదివించాను.వారిని చక్కగా జీవితములో స్థిరపడేటట్టుగా చేశాను.ఇద్దరికీ చక్కగా వివాహములు చేశాను.

45 ఏళ్లతరువాత అనగా 1971 నుండి 2016 వృత్తిలోనే ఉన్నాను.ఇప్పుడు అనగా 2016 నుండీ విశ్రాంత జీవితము.హాయిగా గడుపుతున్నాను.బెంగళూరులో
జీవితాన్ని సంపూర్తిగా అనుభవించాను.70 ఏళ్ళు వయస్సుకి ఇంకేమీ కావాలి.

ఏదో ఒక రోజు ఒంటరిగా వెళ్లిపోతాను.

ఇదండీ నా జీవన యాత్ర.బాగున్నదా.